హైదరాబాద్‌ చుట్టూ రింగ్‌ రైలు ప్రాజెక్టు,,,,కేంద్ర రైల్వే మంత్రి

byసూర్య | Thu, Jul 25, 2024, 10:10 PM

హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు 40 కి.మీ దూరం నుంచి రీజినల్ రింగు రోడ్డు నిర్మిస్తుండగా.. దానికి సమాంతరంగా రింగ్ రైల్ ప్రాజెక్టును నిర్మించే ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. రింగ్‌ రైలు ప్రాజెక్టు నిర్మాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.


 మంగళవారం (జులై 23) కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. రైల్వే బడ్జెట్‌లో కేటాయింపుల వివరాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు మెుత్తం రూ.5,336 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.32,946 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రైన్ నెట్‌వర్క్‌ విద్యుదీకరణ 100 శాతం పూర్తయిందన్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లలో 437 కొత్త ఫ్లై-ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించినట్లు చెప్పారు.


హైదరాబాద్‌ ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టు ఇప్పుడు లాభదాయకంగా నడుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును విస్తరణ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనే విషయంలో కొంత సమస్య ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ అంశంపై తెలంగాణలో ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయన్నారు. కాజీపేట వ్యాగన్‌ ఫ్యాక్టరీ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు మంత్రి వెల్లడించారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ నిర్మాణంపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్‌ ఫ్యాక్టరీలు పెద్దసంఖ్యలో ఉన్నాయన్న మంత్రి.. అక్కడి నుంచి దేశం నలుమూలల ఏయే నగరాలకు సిమెంట్‌ ఎక్కువగా ట్రాన్స్‌పోర్ట్ అవుతుందో పరిశీలించి ఆ వివరాలను పీఎం గతి శక్తి వెబ్ పోర్టల్‌లో ఉంచినట్లు చెప్పారు. వాటి ప్రకారం కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైల్వేలో భద్రతాపరమైన చర్యలకు రూ.1.09 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పదేళ్ల యూపీయే పాలనలో ఉమ్మడి ఏపీకి ఏటా సగటున రూ.886 కోట్లు కేటాయిస్తే.. వార్షిక బడ్జెట్‌ కేటాయింపుల్లో తమ ప్రభుత్వం అంతకు ఆరు రెట్లు పెంచినట్లు తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM