byసూర్య | Wed, Jul 10, 2024, 03:49 PM
పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు అనగా గురువారం హైద్రాబాద్ లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నట్లు ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు నర్సింహులు అన్నారు. బుధవారం కోయిలకొండ మండలం కొత్లాబాద్ గ్రామంలో పంచాయతీ కార్మికులతో మాట్లాడారు. రేపటి ధర్నాకు జిల్లాలోని కార్మికుల తరలి రావాలని కోరారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.