byసూర్య | Wed, Jul 10, 2024, 01:58 PM
పాలకవీడు మండలం కోమటికుంట నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు పాలకవీడు ఎస్సై లక్ష్మినర్సయ్య తెలిపారు. ఈ రేషన్ బియ్యాన్ని నర్సయ్య తరలిస్తున్నట్లు గుర్తించి ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనంతో పాటు బియ్యం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన తరలించిన కఠిన చర్య తప్పవని హెచ్చరించారు