నిరుద్యోగులకు శుభవార్త..35వేల పోస్టుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

byసూర్య | Wed, Jul 10, 2024, 12:01 PM

 ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ నిరుద్యోగులకు అదిరిపోయే వార్తను అందించింది. దాదాపు 35వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే..దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అర్హులైన నిరుద్యోగుల నుంచి పోస్టల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉండగా..ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే ఈ నోటిఫికేషన్ ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 35000 ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు పదవ తరగతి పూర్తి చేయాలి. ఎంపిక విధానం కూడా పదో తరగతి మార్కుల ఆధారంగానే ఉంటుంది. పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఈపోస్టులకు ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18ఏండ్ల నుంచి 40ఏండ్ల మధ్య ఉండాలి.


 


ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బీపీఎం, ఏబీఏం వంటి పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 10వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://indiapostgdsonline.gov.in/ సందర్శించి తెలుసుకోవచ్చు. గతేడాది 50వేలకు పైగా జీడీఎం పోస్టులను భర్తీ చేశారు.


Latest News
 

BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు Tue, Apr 22, 2025, 09:08 PM
మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి Tue, Apr 22, 2025, 08:51 PM
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి చట్టం: ఎమ్మెల్యే Tue, Apr 22, 2025, 08:50 PM
జమ్ముకాశ్మీర్ ఘటన.. స్పందించిన సీఎం రేవంత్ Tue, Apr 22, 2025, 08:44 PM
సీఎం తిరిగొచ్చాక నిర్ణయం: చామల Tue, Apr 22, 2025, 08:36 PM