ములుగు ఏజెన్సీలో కంటెయినర్‌ హాస్పిటల్.. రాష్ట్రంలోనే తొలిసారిగా

byసూర్య | Tue, Jul 09, 2024, 09:25 PM

నగరాలు, పట్టణాల్లో ఎవరికైనా జబ్బు చేస్తే.. నిమిషాల వ్యవధిలోనే హాస్పిటల్‌కు వెళ్తూ ఉంటాం. కానీ గిరిజన ప్రాంతాల్లో అలా కాదు. ఎంత అత్యవసర వైద్యం అయినా వారికి సకాలంలో అందదు. పదుల కి.మీ ప్రయాణిస్తే తప్ప హాస్పిటల్ అడ్రస్ దొరకదు. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో నివసించేవారికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం. ఇక గర్భిణీ స్త్రీలను అయితే డోలీలలో మోసుకొచ్చిన ఘటనలు కూడా చూసి ఉంటాం. ఇక ప్రస్తుతం వర్షాకాలం సీజన్. ఈ సమయంలో మన్యం ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. తద్వారా అమాయక ప్రజలకు వైద్యం అందక ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. గిరిజన ప్రాంతాల్లో సరైన రవాణా సౌకర్యం లేకపోవటంతో వారి వైద్యం అందటం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో కంటెయిన్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.


ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్‌ గ్రామం జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామం నర్సాపూర్, బందాల, అల్లిగూడెం, బొల్లెపల్లి అనే గ్రామాలుంటాయి. అయితే ఇక్కడ నివసించే గిరజన ప్రజలు వైద్యం చేయాలంటే గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం పస్రాలో జరిగే వారాంతపు సంతకొచ్చి సరకులతో పాటు ఎవైనా అనారోగ్య సమస్యలుంటే.. పస్రా ప్రైమరీ హెల్త్ సెంటర్, లేదంటే ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయిస్తుంటారు.


ఎంతటి అత్యవసర వైద్యమైనా సంత జరిగే సోమవారం వరకు ఆగాల్సిందే. ఇలాంటి సమయాల్లో అత్యవసర వైద్యం అందక చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర వినూత్నంగా ఆలోచించారు. అక్కడ వర్షకాలం సీజన్‌లో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని భావించారు. అత్యవసర వైద్య సేవల కోసం ఓ కంటెయిన్‌లో ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. రూ. 7 లక్షల వ్యయంతో నాలుగు పడగకలతో ఈ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో కంటెయినర్ ఆసుపత్రికి తీసుకొచ్చి పోచాపూర్‌లో ఏర్పాటు చేశారు. అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచారు. ఈ వారంలో హాస్పిటల్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.


Latest News
 

జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:39 PM
జీవన్ రెడ్డి రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగిందన్న జగ్గారెడ్డి Fri, Oct 25, 2024, 08:35 PM
తెలంగాణలో పత్తి రైతులకు వాట్సప్ సేవలు: మంత్రి తుమ్మల Fri, Oct 25, 2024, 08:30 PM
మరికల్: కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే Fri, Oct 25, 2024, 08:06 PM
హైడ్రాపై ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు Fri, Oct 25, 2024, 08:04 PM