తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 13 జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

byసూర్య | Tue, Jul 09, 2024, 09:27 PM

తెలంగాణల ప్రజలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. సాయంత్రానికి నగరంలో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు భారీ వర్షాలకు తోడు భారీ స్థాయిలో బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు దాదాపుగా 30-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. పొలం పనులు చేసుకునేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.


ఇక ఈసారి ఆశించినంతంగా వర్షాలు కురవటం లేదు. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఎండాలి దంచికొట్టాల్సింది పోయి వర్షాలు కురిశాయి. ఇక జూన్ నెల మెుదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించినా.. ఆశించినంతగా వర్షాలు మాత్రం కురవలేదు. చాలా జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువగా వర్షాలు కురిశాయి. అయితే జులైలో ఆ పరిస్థితి ఉండదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుందని అన్నారు. బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా విస్తారంగా వానలు పడతాయన్నారు. వాతావరణశాఖ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ పంటలకు ఢోకా లేదని సంతోషిస్తున్నారు.


Latest News
 

కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Fri, Oct 25, 2024, 10:30 PM
గుడ్డుతో తయారు చేసే ఆ పదార్థంపై నిషేధం.. ప్రభుత్వ అనుమతి కోరిన జీహెచ్ఎంసీ Fri, Oct 25, 2024, 10:26 PM