హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. నగరంలో రెండ్రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

byసూర్య | Tue, Jul 09, 2024, 08:07 PM

హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారే చేశారు. నేడు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. బల్కంపేటలోని ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. అమ్మవారి కల్యాణోత్సవ వేడుకలు సోమవారమే (జులై 8) ప్రారంభం కాగా.. 10వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని.. ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ పి.విశ్వ ప్రసాద్‌ వెల్లడించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. ఈ రూట్లలోనే ట్రాఫిక్ ఆంక్షలు..


బేగంపేట కట్ట మైసమ్మ దేవాలయం నుంచి లింకు రోడ్డు మీదుగా బల్కంపేటకు అటుగా వచ్చే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు అనుమతించరు.


గ్రీన్‌ ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా టెంపుల్ వైపు నుంచి సత్యం థియేటర్‌ మీదుగా ఫతేనగర్‌ వెళ్లే వెహికల్స్ బల్కంపేట మీదుగా అనుమతించరు.


గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట కనకదుర్గా ఆలయం నుంచి సత్యం థియేటర్‌ మీదుగా ఎస్సార్‌నగర్‌ టి-జంక్షన్‌ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌ జంక్షన్ నుంచి రైట్ సైడ్ టర్న్ తీసుకొని బీకేగూడ, శ్రీరామ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్డు మీదుగా ఫతేనగర్‌ వైపు వెళ్లాల్సి ఉంటుంది.


ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుండి బల్కంపేట మీదుగా వచ్చే వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. అటుగా వచ్చే వాహనదారులు ఫతేనగర్‌ బ్రిడ్జి మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లాల్సి ఉంటుంది. బల్కంపేట - బేగంపేట లింకు రోడ్డు మీదుగా తాజ్‌ వివంతా హోటల్‌ నుండి యూటర్న్‌ తీసుకుని.. గ్రీన్‌ల్యాండ్స్‌ మీదుగా ఆయా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.


గ్రీన్‌ల్యాండ్స్, బకుల్‌ అపార్ట్‌మెంట్స్, ఫుడ్‌ వరల్డ్‌ వైపు నుంచి ధరంకరం రోడ్డు మీదుగా ప్రయాణాలు సాగించే వాహనాలపై ఆంక్షలు విధించారు. అటుగా వచ్చే వాహనాలు సోనాబాయి ఆలయం, సత్యం థియేటర్‌ నుంచి యూటర్న్‌ తీసుకొని ఎస్సార్‌నగర్‌ T- జంక్షన్, ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీ హాల్, బీకేగూడ, శ్రీరామ్‌నగర్‌ మీదుగా తమ ప్రయాణాలు సాగించాల్సి ఉంటుంది.


ఇక అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చే భక్తుల కోసం అధికారులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఆర్‌అండ్బి కార్యాలయం, జీహెచ్‌ఎంసీ గ్రౌండ్స్, నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్, నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రి రోడ్‌ సైడ్‌ వైపు, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌, ఫతేనగర్‌ రైల్వే బ్రిడ్జి కింద, పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ నుంచి ఆర్‌అండ్‌బి ఆఫీసు వైపు పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగినా తక్షిణ సహాయం కోసం 90102 03626కు ఫోన్‌ చేయవచ్చునని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.Latest News
 

సీఎం సహాయ నిధి చెక్కు పంపిణి Sun, Jul 14, 2024, 06:25 PM
ప్రమాద ఘంటికలు సూచిస్తున్న నీటి నిల్వలు Sun, Jul 14, 2024, 06:23 PM
రాజన్నను దర్శించుకున్న ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ Sun, Jul 14, 2024, 03:56 PM
షాదీఖానా కబ్జా పై ఎమ్మెల్యేకు వినతి Sun, Jul 14, 2024, 03:11 PM
లక్ష్య కళాశాల విద్యార్థికి జాతీయ స్థాయి ర్యాంక్ Sun, Jul 14, 2024, 03:10 PM