తెలంగాణకు చల్లని కబురు.. నేడు 11 జిల్లాల్లో భారీ వర్షాలు

byసూర్య | Mon, Jul 08, 2024, 09:53 PM

ఈ ఏడాది ఆశించినంతగా వర్షాలు కురవటం లేదు. ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వర్షాలు దంచికొట్టాయి. రైతులు విత్తనాలు విత్తే జూన్ నెలలో మాత్రం సరిగ్గా వర్షాలు పడలేదు. అడపాదడపా భారీ వర్షాలు మినహా.. ఎక్కువగా రైతులకు లాభం చేసేలా వర్షాలయితే కురవలేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. తెలంగాణ ప్రజలకు, రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తీపి కబురు చెప్పింది. నేడు తెలంగాణలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుత పవనాలు, ద్రోణి ప్రభావంతో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. నేడు వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాలకు తోడు భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.


ఇక మంగళవారం (జులై 9) పై జిల్లాలతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక బుధ, గురువారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లా్ల్లో వర్షం పడే ఛాన్స్ అధికంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలలో 4.5 సెం.మీటర్లు వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.


భీంపూర్‌ మండలం అర్లిలో 4.2 సెం.మీ , కామారెడ్డి జిల్లా పిట్లంలో 3.7 సెం.మీ, నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌లో 3.6 సెం.మీ, నిజామాబాద్‌ జిల్లా చిమన్పల్లిలో 3.5 సెం.మీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.



Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM