సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భేటీ.. మిలిగిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లోకేనా..?

byసూర్య | Mon, Jul 08, 2024, 08:23 PM

సాధారణంగా ఎన్నికల ముందు పలువురు రాజకీయ నేతలు పార్టీలు మారుతారు. కానీ.. తెలంగాణలో మాత్రం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా.. ఇంకా జంపింగ్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగి హస్తంతో జత కట్టారు. ప్రస్తుతానికి ఏడుగురు ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదే దారిలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మెుత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మరో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. గద్వాల నుంచి కారు పార్టీపై గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ జిల్లాలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే కారు పార్టీకి మిగిలారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. విజయుడితో కలిసి తాను పార్టీ మారేందుకు చల్లా సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే సీఎంతో చర్చలు జరిపినట్లు తెలిసింది.


అలంపూర్ ఎస్సీ రిజర్వ్‌డు స్థానం. దీంతో అక్కడ బలమైన కేడర్ ఉన్న చల్లా వెంకట్రామిరెడ్డి తన అనుచరుడైన విజయుడికి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించి గెలిపించాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని.. విజుయుడికి టికెట్ ఇప్పించటంతో పాటు అతడిని ఘన విజయం దక్కేలా చల్లా అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోవటంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు ఎమ్మెల్సీ చల్లా డిసైడ్ అయినట్లు తెలిసింది. తనతో పాటు ఎమ్మెల్యే విజయుడిని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు చల్లా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అదే జరిగితే.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఆ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరినట్లు అవుతుంది.


ఇక గ్రేటర్ పరిధిలో ఓ నలుగురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కారు పార్టీకి గుడ్‌బై చెప్పి వారు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రందింపులు పూర్తయ్యాయని.. ఈ వారంలో ఎప్పుడైనా వారు పార్టీ మారే ఛాన్స్ ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటుంన్నారు.


Latest News
 

స్పెషల్ పోలీసులు ఇలా చేయటం ఎన్నడూ అభిలషణీయం కాదు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ Mon, Oct 28, 2024, 07:31 PM
డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM