byసూర్య | Mon, Jul 08, 2024, 02:21 PM
మాజీ ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా సోమవారం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని వైయస్సార్ విగ్రహానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, నిరుపేదల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి వైయస్సార్ అని మేఘారెడ్డి అన్నారు.