byసూర్య | Mon, Jul 08, 2024, 02:18 PM
తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని చిరస్థాయిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని సోమవారం కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడి గుండెల్లో గూడు కట్టుకున్నారని గుర్తు చేశారు.