వ్యవసాయం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌.. ఏం పంటలు పండిస్తున్నారో తెలుసా

byసూర్య | Mon, Jun 24, 2024, 10:00 PM

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుకు వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏమాత్రం తీరిక సమయం దొరికినా.. ఆయన డెరెక్టుగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోతారు. ఒక రైతు బిడ్డగా, రైతుగా తన ఫాంహౌస్‌లో రకరకాల పండలు పండిస్తారు. గతంలో ఆయన తన వ్యవసాయక్షేత్రంలో పసుపు, వెల్లుల్లి, ఆలుగడ్డలు, క్యారెట్, క్యాప్సికం వంటి డిమాండ్ ఉన్న పంటలు పండించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.


ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. నేరుగా ఫాంహౌస్‌కు వెళ్లిపోయిన కేసీఆర్ అక్కడ కాలు జారి పడిపోయిన సంగతి తెలిసందే. ఆ తర్వాత ఆయన తుంటి ఎముకకు సర్జరీ జరగ్గా.. కోలుకునే సమయంలోనూ ఆయన వ్యవసాయంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గజ్వేల్‌లోని ఓ ఫర్టిలేజర్ యజమానికి ఫోన్ చేసి.. ఈసారి బొప్పాయి, పుచ్చకాయ తదితర పంటలు పండించేందుకు కావాల్సిన విత్తనాలు పంపించాలని కోరారు. అందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైర్‌గా మారింది.


కాగా, ప్రస్తుతం కేసీఆర్ వ్యవసాయంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టినట్లు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల హడావుడి ముగియటంతో ఫాంహౌస్‌లో సేద తీరుతున్న గులాబీ బాస్.. తన పొలంలో రకరకాల పంటలు పండించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొత్త కొత్త వరి వంగడాలను తెప్పించి పొలంలో నాట్లు వేయించారు. పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తూ సాగు చేస్తున్నారు. గ్లూకోస్ కంటెంట్ తక్కువగా ఉండే షుగర్ ఫ్రీ ధాన్యాన్ని కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు ఉద్యాన పంటలు, సీజన్‌తో సంబంధం లేకుండా దొరికే పండ్లు, ఆర్గానిక్ పద్దతుల్లో కూరగాయల సాగుపై ఆయన దృష్టి పెట్టారట.


ఫాంహౌస్‌ మెుత్తం ఇటీవల భూమి పరీక్షలు చేయించారట. ఎక్కడ సారవంతమైన భూమి ఉంది.. అందులో ఎలాంటి పంటలు పండిచచ్చుననే దానిపై పనివాళ్లకు ఒక అవగాహన కల్పించినట్లు తెలిసింది. వర్షాలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సమయంలో తేలికపాటి వర్షాలతోనూ కమర్షియల్ పంటలు ఎలా పండించాలనే దానిపై కేసీఆర్ దృష్టి సారించారట. అందుకోసం ప్రతీది ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలిసింది. ఇక కేసీఆర్ ఉద్యమ సమయంలోనూ, కేంద్ర మంత్రిగా ఉన్నా.. ముఖ్యమంత్రిగా ఉన్నా.. వ్యవసాయానికి మాత్రం దూరం కాలేదు. ఖాళీ సమయం దొరికితే వ్యవసాయంపై దృష్టి సారించేవారు. ఇటీవల పొలం గట్టున ఆయన కుర్చీ వేసుకొని సాదాసీదాగా కూర్చొని పంటను పరిశీలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Latest News
 

ఆగస్టులో ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ,,,మంత్రి పొంగులేటి Sun, Jul 21, 2024, 10:56 PM
ఆ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపు, వైద్య ఖర్చులకు 4 లక్షలు Sun, Jul 21, 2024, 10:08 PM
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన,,,,ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు Sun, Jul 21, 2024, 10:04 PM
కొత్త బస్సులు కొనుగోలు,,,ఆర్టీసీ బస్సుల్లో రద్దీకి చెక్,,మంత్రి పొన్నం Sun, Jul 21, 2024, 10:00 PM
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. గోదావది ఉగ్రరూపం Sun, Jul 21, 2024, 09:48 PM