చొప్పదండి ఎమ్మెల్యే సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్యకు కారణం ఇదేనా?

byసూర్య | Sat, Jun 22, 2024, 08:03 PM

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, ఇందుకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ, రూపాదేవికి గైనిక్‌ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తల్లి భూలక్ష్మమ్మ తెలిపారు. తన కుమార్తె చాలా సున్నిత మనస్కురాలని అన్నారు. సత్యం, రూపాదేవిలది ప్రేమ వివాహం. బీఎల్, బీఈడీ పూర్తిచేసిన ఆమె.. ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగం సాధించారు.


 రూపాదేవి ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్న రోజుల్లోనే సత్యంతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు యోజిత్‌ (11), రుషికశ్రీ (8) జన్మించారు. న్యాయవాది కోర్సుతో పాటు బీఎడ్ పూర్తిచేసిన రూపాదేవి.. డీఎస్సీలో ఎంపికై ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించింది. ఆమెకు తొలుత మునీరాబాద్‌లో పోస్టింగ్‌ వచ్చింది. తర్వాత మేడ్చల్‌లోని రావల్‌కోల్‌ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు బదిలీ అయ్యింది.


అయితే, నెల రోజుల కిందటే అల్వాల్‌ పంచశీల కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి ఎమ్మెల్యే కుటుంబం వచ్చింది. గతేడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేడిపల్లి సత్యం చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన భర్త ఎమ్మెల్యేగా గెలుపొందడంతో తోటి ఉపాధ్యాయులతో కలిసి రూపాదేవి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు.


శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లడంతో ఎమ్మెల్యే సత్యం మూడు రోజులు పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే గురువారం నియోజకవర్గానికి వెళ్లేందుకు బయలుదేరారు. కానీ, ఇంట్లోనే ఉండాలని, వెళ్లొదని భర్తకు రూపాదేవి చెప్పినట్లు సమాచారం. అయిసరే ఆయన వెళ్లడంతో అదే రోజు రాత్రి 10:30కు భర్తతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో కంగారుపడిన ఎలాంటి అఘాయిత్యానికి పాల్పొడొద్దని, తాను వచ్చేస్తున్నానని చెప్పినట్టు భోగట్టా.


ఫోన్ కట్‌చేసిన రూపాదేవి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. ఆ సమయంలో తల్లి భూలక్ష్మమ్మ, పిల్లలతో పాటు బంధువు ఒకరు ఇంట్లోనే ఉన్నారు. కొద్దిసేపటికి తలుపులు తెరిచేందుకు పిల్లలు ప్రయత్నించగా తెరుచుకోలేదు. కుమార్తె రుషిక ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. ఆపార్ట్‌మెంట్‌లోనే ఉన్న కొందరు వచ్చిన తలుపులను బలవంతంగా తెరిచారు. కానీ, అప్పటికే రూపాదేవి సీలింగ్‌కు చున్నీతో ఉరివేసుకున్నారు.


Latest News
 

కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర ...రేవంత్ కు కేటీఆర్ కౌంటర్ Wed, Oct 30, 2024, 12:24 PM
జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసు...మోకిల పీఎస్‌ కు రాజ్ పాకాల.. Wed, Oct 30, 2024, 12:10 PM
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సంబరాలు Wed, Oct 30, 2024, 12:01 PM
మట్టి దివ్వెలు వాడి.. పర్యావరణాన్ని కాపాడుకుందాం Wed, Oct 30, 2024, 11:56 AM
అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా!: కాంగ్రెస్ Wed, Oct 30, 2024, 11:53 AM