హైదరాబాద్‌లో తొలిసారి బొగ్గు గనుల వేలం.. 'శ్రావణపల్లి'పై సింగరేణి కన్ను

byసూర్య | Wed, Jun 19, 2024, 07:40 PM

దేశంలో కొత్త గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గ గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం.. ఆసారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈనెల 21న వేలం ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కేంద్రం వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. దీంతో ఈ గనిని దక్కించుకునేందుకు సింగరేణి ప్రయతిస్తోంది. అందు కోసం తొలిసారి గనుల వేలంలో పాల్గొనాలని భావిస్తోంది.


సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనలేదు. తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను వేలంతో సంబంధం లేకుండా డైరెక్టుగా కేటాయించాలని సింగరేణి గతంలో పలుమార్లు కేంద్ర బొగ్గుశాఖను విజ్ఞప్తి చేసింది. గంతలో వేలానికి దూరంగా ఉండడంతోసత్తుపల్లి-3, కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా శ్రావణపల్లి గనులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. వేలంలో గనులు దక్కించుకుంటే.. అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4 శాతానికి పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది.


ఈ ట్యాక్స్ అధికంగా చెల్లించడానికి సిద్ధమైన కంపెనీలకే గనులను కేటాయించేందుకు కేంద్ర బొగ్గుశాఖ మెుగ్గుచూపుతుంది. దేశవ్యాప్తంగా పలు ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం 20 నుంచి 30 శాతం రాయల్టీని చెల్లిస్తున్నాయి. దీంతో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై సింగరేణి ఆశలు పెట్టుకుంది. వేలంతో సంబంధం లేకుండా డైరెక్టుగా గనులు కేటాయించేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే బొగ్గు అమ్మకాలపై స్టేట్ గవర్నమెంట్‌కు రాయల్టీ రూపంలో చెల్లించే భారం తగ్గుతుందని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరుణ చూపించాలని కేంద్రమంత్రిని సింగరేణి సంస్థ ఉద్యోగులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.


Latest News
 

డిసెంబర్ 9 కల్లా రెండు లక్షల రుణమాఫీ! Mon, Oct 28, 2024, 03:45 PM
హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు Mon, Oct 28, 2024, 03:37 PM
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Mon, Oct 28, 2024, 03:32 PM
హైదరాబాద్‌ లో విషాదం ...మోమోస్‌ తిని ఓ మహిళ మృతి Mon, Oct 28, 2024, 02:53 PM
PAC చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ విధానాన్ని ఎండగట్టిన వేముల ప్రశాంత్ Mon, Oct 28, 2024, 02:29 PM