వామ్మో ఇంత దరిద్రమా.. ఈ హోటళ్లలో తింటేనే కాదు, కిచెన్లను చూస్తేనే సగం రోగాలు వస్తాయ్

byసూర్య | Tue, Jun 18, 2024, 07:41 PM

హైదరాబాద్‌లో జనాలు.. హోటళ్లు, రెస్టారెంట్లలో తిండికి బాగా అలవాటు పడిపోయారు. ఇక.. జొమాటో, స్విగ్గీ లాంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు వచ్చినప్పటి నుంచి ఇళ్లలో వండుకోవటమే మానేశారా అన్నట్టుగా మా పరిస్థితి మారిపోయింది. అయితే.. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలు, ఆ తనిఖీల్లో బయటపడుతున్న విస్తుపోయే విషయాలు చూస్తుంటే.. ఇన్నాళ్లు తిన్నది ఇదా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉండటం శోచనీయం. ఫుడ్ తయారీ కోసం వాడే పదార్థాల్లో నాణ్యత లేకపోవటం, డేట్ అయిపోయిన వాటిని వాడటం, కిచెన్‌లో శుభ్రత ఏమాత్రం పాటించకపోవటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. నగరంలోకి కాస్ట్లీ ఏరియా అయిన మాదాపూర్‌‌లోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.


మాదాపూర్‌లోని నారాయణ సొసైటీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో.. గడువు ముగిసిన ఆహార పదార్థాలతో పాటు అత్యంత దారుణంగా ఉన్న కిచెన్ పరిసరాలు, భోజనం తయారు చేసే పాత్రల దుస్థితిని అధికారులు గుర్తించారు. దోశలు వేసే ప్యాన్ పూర్తిగా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా చిలుము పట్టి ఉండడాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాదు.. భోజనం తయారీ కోసం వాడే పదార్థాల్లో చాలా వరకు డేట్ అయిపోయినవాటిని వాడుతునట్టు గుర్తించారు.


మరోవైపు.. గ్రైండింగ్ చేసే దగ్గర అత్యంత అపరిశుభ్రంగా కనిపించింది. ఇక వాష్ ఏరియా చూస్తే.. తినకుండానే వాంతి చేసుకోవటం ఖాయం. అంత అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. విపరీతమైన దుర్వసన కూడా వస్తుండటం గమనార్హం. ఇక ఆహార పదార్థాలు స్టోర్ చేసే ఫ్రిజ్ పరిస్థితి అయితే.. ఏ చెత్తకుప్పలోనో వేసినట్టుగా దాని అవతారం ఉంది. ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ మొత్తం జిడ్డు కారుతూ కనిపించింది. అక్కడి కిచెన్ చూస్తుంటే.. ఆ హోటల్‌లో తింటేనే కాదు.. ఆ పరిస్థితి చూస్తేనే రోగాలు వచ్చే దుస్థితి కనిపించింది.


ఈ పరిస్థితులన్ని గుర్చించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ఆ హోటల్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని.. ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలే కాదు.. కఠిన చర్యలు తప్పవంటూ అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. ఇలాంటి పరిస్థితుల్లో చేసిన ఆహారాన్ని తింటే.. భూమ్మీద ఉన్న రోగాలన్ని ఒక్కసారే వచ్చే అవకాశం ఉంది. నాణ్యత, శుభ్రత రెండూ లేని పరిస్థితుల్లో తయారు చేసే ఆహారం ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదకరమేనని అటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చెత్తను తింటే.. దీర్ఘకాలంలో కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. వాడిన నూనెను మళ్లీ వాడడం, స్టోర్ చేసిన ఫుడ్ తీసుకోవటం, అపరిశుభ్రమైన పాత్రల్లో తయారు చేసిన ఆహారపదార్థాలు తినటం వల్ల.. లేని రోగాలన్ని వచ్చి.. మనిషిని జబ్బుల కుప్పగా మార్చేస్తాయని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM