![]() |
![]() |
byసూర్య | Tue, Jun 18, 2024, 02:39 PM
పోలీసు జాగిలం తార అందజేసిన సేవలు మరువలేనివి అని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. పోలీసు జాగిలం తార పదవీ విరమణ కార్యక్రమాన్ని పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని జాగిలం ను శాలువా పూలమాలలతో సత్కరించి సేవలను కొనియాడారు. బాంబులు, మందు గుండు సామాగ్రి కనుగొనడంలో పోలీసు జాగిలం తార ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఎస్పీ పేర్కొన్నారు.