తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

byసూర్య | Sat, Jun 01, 2024, 10:38 AM

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. అయితే ప్రతి నెల 1వ తేదీ ధరల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. తాజాగా, నేడు జూన్ 1న తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి చమురు సంస్థలు వినియోగ దారులకు శుభవార్త అందించాయి.కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 72 మేర తగ్గించాయి.దీంతో నేడు హైదరాబాద్‌లో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,903కు చేరింది. ఇక ఢిల్లీలో రూ. 69.5 మేర తగ్గగా రూ. 1676కి విక్రయిస్తున్నారు. చెన్నైలో రూ. 70.5 మేర తగ్గింది. దీంతో రూ. 1840కి చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 72 మేర తగ్గడంతో రూ. 1787కు విక్రయిస్తున్నారు. ముంబైలో రూ. 69.5 తగ్గి రూ. 1629కి చేరింది. కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. ఇక గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో స్థిరంగా కొనసాగుతున్నాయి.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM