ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు... ఆహ్వాన లేఖతో పాటు రేవంత్ రెడ్డి రాసిన లేఖ కేసీఆర్‌కు అందజేత

byసూర్య | Fri, May 31, 2024, 08:50 PM

 తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి ప్రభుత్వ ప్రతినిధులు వేణుగోపాల్, అర్విందర్ సింగ్ వెళ్లారు. ఆవిర్భావ వేడుకలకు ఆయనను ఆహ్వానించిన అనంతరం కేసీఆర్ నివాసం బయట వారు మీడియాతో మాట్లాడుతూ... ఆహ్వాన పత్రికను అందించడంతో పాటు కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించినట్లు చెప్పారు. ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఉందని... అందుకే ఆహ్వానించినట్లు చెప్పారు. ఆహ్వానం పట్ల కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో... ఉద్యమనేతగా ఆయనను ఆహ్వానించామన్నారు. ఈ వేడుకలలో కేసీఆర్ భాగస్వాములు అవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, విపక్షనేతగా, ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM