లగేజీ సర్దుతుండగా అడ్డం వచ్చాడని టీటీఈపై ప్రయాణికురాలు దాడి

byసూర్య | Fri, May 31, 2024, 08:04 PM

రైల్లో టీటీఈతో గొడవపడిన ప్రయాణికులు ఆయనపై దాడికి తెగబడ్డారు. యశ్వంత్‌పూర్- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో జరిగిన ఈ ఘటన టీటీఈకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స కోసం సికింద్రాబాద్‌ రైల్వే ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన యశ్వంత్‌పూర్‌- గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో టీటీఈ వీజే అనీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైలు మౌలాలి స్టేషన్‌కు చేరుకునేటప్పటికి ఎస్‌-2 బోగీలోని ప్రయాణికుల టిక్కెట్లను ఆమె తనిఖీ చేస్తున్నారు.


ఇదే సమయంలో అయోధ్యకు వెళ్తున్న ఓ ప్రయాణికురాలు తన లగేజీ సర్దుకుంటోంది. ఆమెకు టీటీఈ అడ్డుతగలడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవకు దిగింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. చివరకు ఒకరిపై ఒకరు చేయిచేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో టీటీఈని ప్రయాణికురాలు తోసేయడంతో కిందపడి గాయాలయ్యాయి. రైలు భువనగిరి చేరుకోగానే నిలిపివేసి..గాయపడిన టీటీఈని కిందకు దింపారు. ఆమెకుఅక్కడ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన.. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌ రైల్వే ఆసుపత్రికి తరలించారు.


టీటీఈ అనీ ఫిర్యాదు మేరకు జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిచేసిన ప్రయాణికురాలితో పాటు మరికొందర్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనీని అధికారులు, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘాల నాయకులు అమెను పరామర్శించారు.


Latest News
 

పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM
సిరి సంపదలు ఇచ్చే దైవం అయ్యప్ప స్వామి... ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.. Mon, Oct 21, 2024, 04:17 PM
మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు Mon, Oct 21, 2024, 04:14 PM
రైతు భరోసా చెల్లించాలని బి ఆర్ ఎస్ నిరసన Mon, Oct 21, 2024, 04:08 PM