మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదు

byసూర్య | Mon, Oct 21, 2024, 04:14 PM

రైతు భరోసా ఇస్తామని అబద్ధాలతో అధికారంలో  వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేక అబద్ధాలతో కాలం గడుపుతున్నారని పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆదివారం మండల కేంద్రమైన జగదేవపూర్ లో అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా ఇవ్వలేమని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల ముందు ఆరు గార్యంటిల అబద్దాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. వానకాలం పంటలు పండి రబీ సీజన్ మొదలైనప్పటికీ నేటికీ రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. అలాగే రెండు లక్షల రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బుద్ధ నాగరాజు,  కవిత శ్రీనివాస్ రెడ్డి,  మహేష్,  గణేష్,  రామచంద్రం, వెంకట్ నర్స్,  దర్గయ్య, కనకయ్య, శ్రీనివాస్, భాస్కర్, ప్రశాంత్, సత్యం తదితరులు పాల్గొన్నారు...


Latest News
 

రైతు భరోసా అందించాలని బిఆర్ఎస్ ధర్నా Mon, Oct 21, 2024, 05:29 PM
బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM