సూర్యాపేట జిల్లాలో క్షుద్రపూజల కలకలం,,,ఓ ఇంట్లో పూజల పేరుతో పెద్ద పెద్ద శబ్దాలు

byసూర్య | Wed, May 29, 2024, 07:34 PM

అర్ధరాత్రి 12 దాటింది. గ్రామంలోని ప్రజలందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. ఇంతలో ఊరు చివర ఉన్న పాడుబడిన ఇంట్లో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. కుక్కలు, పిల్లులు శబ్దాలు చేసి ఉంటాయని గ్రామస్తులు మెుదట భావించారు. చాలా సేపు శబ్దాలు అలాగే రావటంతో భయంతో వణికిపోయారు. రాత్రి సమయంలో ఆ ఇంట్లోకి వెళ్లే సాహసం ఎవరూ చేయలేకపోయారు. ఉదయాన్ని కొంత ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంట్లోకి వెళ్లి చూడగా.. వారికి షాకింగ్ సీన్ కనిపించింది.


ఇంట్లో ఓ మూలకు పసుపు, కుంకుమ, అగరబత్తులు, నిమ్మకాయలు, అరటి పండ్లు కనిపించాయి. తవ్వకపు ఆనవాళ్లు కూడా గ్రామస్తులు గమనించారు. వెంటనే ఇవి గుప్తనిధుల కోసం చేసిన క్షుద్రపూజలుగా నిర్ధారణకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్‌లో గతరాత్రి క్షుద్రపూజలు కలకలం రేపాయి. గ్రామంలోని ఓ పాడుబడిన ఇంట్లో కొందరు క్షుద్ర పూజలు చేశారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావటంతో గ్రామస్థులు హడలిపోయారు.


తెల్లావారిన తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా.. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తాయత్తులు, అరటిపళ్లతో పాటు ఇతర పూజా సామాగ్రిని గుర్తించారు. ఇంట్లో తవ్వకాలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇంటి యజమాని పద్మ అనే మహిళ ఈ పూజలు చేయించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. నరసరావుపేట నుంచి మాంత్రికులను తీసుకొచ్చి పూజలు చేయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసారు.


కాగా, మనిషి అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్న ఈ రోజుల్లో అంధ విశ్వాసాలు ప్రజలను ఇంకా వీడిపోవటం లేదు. గుప్త నిధులు ఉన్నాయంటూ.. నర బలులు, క్షుద్రపూజలు వంటివి చేస్తున్నారు. ఇలాంటివి నమ్మకూడదని పోలీసులు, తత్వవేత్తలు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM