తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఇదేనా..? సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

byసూర్య | Wed, May 29, 2024, 07:31 PM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్.. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించాలని భావిస్తోంది. వేడుకల ఏర్పాట్లపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇప్పటికే ప్రకటించినట్టుగా తెలంగాణ రాష్ట్ర గీతం, కొత్త అధికారిక చిహ్నాన్ని కూడా ఆవిష్కరించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్ర గీతాన్ని రూపొందించేందుకు అందెశ్రీకి బాధ్యతలు అప్పగించగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసి జయ జయహే తెలంగాణ పాటను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందించే బాధ్యతలను కళాకారుడు రుద్ర రాజేశానికి అప్పజెప్పారు.


రుద్ర రాజేశం.. ఇప్పటికే పలు డిజైన్లను రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి చూపించగా.. తుదిరూపుపై జూబ్లీహిల్‌‌‌ని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కళాకారుడు రుద్ర రాజేశంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. దీంతో.. కొత్త అధికార చిహ్నాం ఎలా ఉంటుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.


ఈ క్రమంలోనే అధికారిక చిహ్నానికి సంబంధించిన మూడు రకాల లోగోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కొత్త రాజముద్ర ఇదేనంటూ.. ఆ మూడు లోగోల ఫొటోలను వైరల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫొటోల్లో మొదటి లోగో మధ్యలో పూర్ణకుంభం.. పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, కింది భాగంలో చార్మినార్ బొమ్మ ఉంది. పూర్ణకుంభం ఇరువైపులా తంగేడు ఆకులు కూడా ఉన్నాయి. రెండో లోగోలో పైభాగంలో మూడు సింహాల రాజముద్ర, మధ్యలో తెలంగాణ మ్యాప్, కింది భాగంలో హుస్సేస్ సాగర్‌లోని బొమ్మ కనిపిస్తోంది.


మూడో లోగోలోనూ.. పైభాగంలో మూడు సింహాల చిహ్నం ఉండగా.. మధ్యలో వెలుగుతున్న సూర్యున్ని తలపించేలా ఓ గుర్తు ఉండి.. దాని చూట్టూ నీటి బిందువుల ఆకారాలు విస్తరించి ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూడు చిహ్నాల్లో నాలుగు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దు) తెలంగాణ పేరు కనిపిస్తోంది.


అయితే.. ఈ మూడు చిహ్నాల్లో ఏది నిజమైన అధికార చిహ్నమని ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే.. వైరల్ అవుతున్న ఈ మూడు చిహ్నాల్లో ఎందులోనూ అమరవీరుల స్థూపానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించకపోవటం గమనార్హం. మరి చూడాలి.. ఏది ఫైనల్ అయ్యిందో.. మరి మీరూ ఈ చిహ్నాలపై ఓ లుక్కేసుకోండి. మీకు ఏది నచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM