కవితకు మరో షాక్.. వాళ్లందరూ కోర్టుకు.. జూన్ 3న ఏం జరగనుంది

byసూర్య | Wed, May 29, 2024, 07:28 PM

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా అరెస్టయి.. తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కవితపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ ఎవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన ఛార్జిషీట్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోవటమే కాకుండా.. జూన్ 3వ తేదీన ఛార్జిషీట్లో పేర్కొన్న నిందితులందరూ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో వచ్చే నెల 3న కవితను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెటట్నున్నారు.


విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. తాజాగా ఈరోజు ఈడీ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న (మే 28న) ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్డు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు.


ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకుని ఇందులో నిందితులుగా ఉన్న వారందరిని విచారణకు పిలవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. జూన్ 3న ఏం జరగనుందన్నది ఉత్కంఠగా మారింది.


ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. కవిత బెయిల్‌ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం ఈడీ అధికారులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది . ఈ మద్యం వ్యాపారం గురించి కేసీఆర్‌కు.. కల్వకుంట్ల కవిత ముందే వివరాలు చెప్పినట్టుగా కోర్టుకు తెలిపింది. కవిత తన టీమ్‌ సభ్యులైన బుచ్చిబాబు, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ పిళ్లైలను.. ఢిల్లీలో కేసీఆర్‌కు పరిచయం చేశారని కూడా పేర్కొన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు సమీర్‌ మహేంద్రును బుచ్చిబాబు పరిచయం చేసినట్లు తెలిపింది. సమీర్ మహేంద్రను అడిగి ఢిల్లీ మద్యం వ్యాపారం వివరాలను కేసీఆర్‌ తెలుసుకున్నారని ఈడీ వివరించింది.



Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM