చంద్రబాబు గెలిస్తే 2 తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారేమోనని భయమైతుంది: పాశం యాదగిరి

byసూర్య | Wed, May 29, 2024, 07:25 PM

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు కావొస్తున్న సందర్భంగా ఉద్యమకారులను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎవరూ వెళ్లొద్దని తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని మండిపడ్డారు.


దొంగలంతా మీ పక్కన ఉంటరా..? మేం ఎక్కడున్నం.. వాళ్లెక్కడన్నరు. గద్దర్ ఎక్కడనున్నరు. ఐక్య కార్యచరణ కమిటీతో ఉద్యమాలు చేశాం. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడికి పోయినం. ఓపెన్ కాస్ట్, ఫార్మాసిటీ, రైతు చావులు ఇలా ప్రతి సమస్యకు మేం ముందున్నాం. త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. రాజకీయ నాయకులతో కాదు. ఏ రాజకీయ నాయకుడి ద్వారా తెలంగాణ రాలేదు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్లను మాత్రం ఒప్పుకునేది లేదు. చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయమైతుంది. మళ్ల ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ, ఆంధ్రా కలిపిసోతదేమో.. మీ కాంగ్రెసోళ్లే మళ్లా కలుపుతరేమోనని. అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జరిగే సన్మానాన్ని బాయ్‌కాట్ చేస్తున్నాం. మేం రావాలంటే మీరు అర్హత సాధించాలి. అని పాశం వ్యాఖ్యనించారు.


అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పాశం యాదగిరి మాటలు సరైనవి కావని అన్నారు. ముఖ్యమంత్రి ఆదరించి సన్మానం చేస్తానంటే రానని అనటం సరైంది కాదని వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాలు వేరని.. అందుకే పలువుర్ని పార్టీలో జాయిన్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. మధ్యలో కలగజేసుకున్న పాశం యాదగిరి మహేష్ కుమార్‌తో గొడవకు దిగారు. ఆయన చేతిలోని మైక్‌ను లాగేశారు. దీంతో స్టేజీపై కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడున్నవారు సర్ధి చెప్పటంతో గొడవ సద్దుమణిగింది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM