రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్

byసూర్య | Tue, May 28, 2024, 08:39 PM

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎండలు కాస్తూనే.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. తాజాగా.. మరోసారి రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ అయింది. బంగాళాఖాతంలో కల్లోలం సృష్టించిన రెమల్ తుఫాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


ఈ తుపాను కారణంగా నేడు మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, సూర్యాపేట. నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఇక రాష్ట్రంలో తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు గణణీయంగా పెరుగుతాయన్నారు. ఎండతీవ్రతో పాుట ఉక్కపోత కూడా ఉండే ఛాన్స్ ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


Latest News
 

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..? Tue, Jun 18, 2024, 03:27 PM
నీటి పంపింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే Tue, Jun 18, 2024, 03:26 PM
గురుకుల కళాశాలలో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ Tue, Jun 18, 2024, 03:24 PM
పాత బస్తీలో దారుణం Tue, Jun 18, 2024, 03:22 PM
బ్రహ్మోత్సవాలకు చిన్నారెడ్డికి ఆహ్వానం Tue, Jun 18, 2024, 03:17 PM