అన్నదాతకు రైతు భరోసా.. ఎకరానికి రూ.15 వేలు, అమలు ఎప్పట్నుంచంటే

byసూర్య | Mon, May 27, 2024, 07:32 PM

రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 15 వేల పంట పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సగంతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు ఎకరానికి రూ. 10 (వేలు రెండు విడతల్లో) పథకాన్నే అమలు చేశారు. 5 ఎకరాల్లోపు రైతులకు రైతుబంధు సాయం అందించగా.. మిగిలిన రైతులకు కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాత అందిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు.


తాజాగా.. రైతు భరోసా పథకంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎకరానికి రూ. 15 వేల సాయం అందిస్తామని చెప్పారు. వానకాలం సీజన్‌లోనే రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుందని చెప్పారు. ఎకరానికి రూ. 7500 చొప్పున రెండు విడతల్లో మెుత్తం రూ. 15 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. గతంలో గుట్టలు, స్థిరాస్తి భూములకు కూడా రైతుబంధు ఇచ్చి ప్రభుత్వ డబ్బును దుర్వి నియోగం చేశారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం అసలైన పంట సాగు చేసే రైతులకే సాయం అందిస్తుందన్నారు.


ఇక కౌలు రైతులు, రైతు కూలీలకు అందించే సాయంపైనా విధివిధానాలు రూపొందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. రైతు పంట బీమాపైనా తగిన చర్యలు తీసుకొని అన్నదాతపై భారం పడకుండా చూస్తామన్నారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM