'నేను పర్సనల్‌గా తీసుకుంటే మీకే నష్టం'.. మంత్రి ఉత్తమ్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి వార్నింగ్

byసూర్య | Mon, May 27, 2024, 07:29 PM

పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిల మధ్య మాటాల యుద్దం నడుస్తూనే ఉంది. రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖలో రూ.1000 కోట్లు అవినీతి జరిగిందంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలపై స్పందించిన మంత్రి ఉత్తమ్.. ఏలేటిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మహేశ్వర్‌ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంటే.. డబ్బులిచ్చి ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నంత ఈజీ కాదని సెటైర్లు పేల్చారు.


ఉత్తమ్ కామెంట్లపై ఏలేటి తాజాగా మరోసారి స్పందించారు. మంత్రి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. తన పొలిటికల్ కెరీర్‌లో ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదని అన్నారు. అయినా బెదరింపులకు తాను ఏ మాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ నిర్వహిస్తున్న శాఖలో జరిగిన అవినీతిని మాత్రమే బయటపెట్టానని అన్నారు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే.. తాను సహించబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. అదే స్పీడ్‌తో పని చేశానని.. ఇప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నేతగా అదే రీతిలో పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు.


తెలంగాణలో జరుగుతున్న అవినీతిపైనే తన పోరాటమని చెప్పారు. ఎవరిపైనో వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. మంత్రి శాఖలో జరిగిన అవినీతి గురించి మాట్లాడితే పర్సనల్ తీసుకోవద్దని సూచించారు. ఒకవేళ తాను కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే ఉత్తమ్ చాలా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని.. సివిల్ సప్లయ్ శాఖలో అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై కేంద్రానికి త్వరలోనే ఫిర్యాదు చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


Latest News
 

గంగవ్వపై జగిత్యాలలో కేసు నమోదు,,,జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదు Wed, Oct 23, 2024, 11:21 PM
గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు Wed, Oct 23, 2024, 11:19 PM
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ అదే.. అధికారులతో రంగనాథ్ సమీక్ష Wed, Oct 23, 2024, 11:17 PM
నలుగురు విద్యార్థులు మిస్సింగ్.. రాత్రి వేళ హాస్టల్‌లో గొడవ Wed, Oct 23, 2024, 10:20 PM
యూట్యూబర్ హర్షసాయికి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు Wed, Oct 23, 2024, 10:19 PM