మాజీ మంత్రి శ్రీమతి యెర్నేని సీతాదేవి కన్నుమూత

byసూర్య | Mon, May 27, 2024, 12:38 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. హైదరాబాద్లో ఈరోజు (మే 27వ తేదీ) ఉదయం గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హైదరాబాద్ నుంచి సీతాదేవి పార్థివదేహాన్ని ఇవాళ సాయంత్రం ఏపీలోని కైకలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలంలో ఆమె స్వగ్రామం కోడూరుకు తీసుకువెళ్తారు. అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు.ముదినేపల్లి నుంచి టీడీపీ తరఫున ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చంద్రబాబు సీతాదేవి మరణంపై స్పందిస్తూ సంతాపం ప్రకటించారు.


 


 


Latest News
 

75% పూర్తైన ఎయిమ్స్ బీబీనగర్ నిర్మాణం.. ఫోటోలు షేర్ చేసిన కేంద్ర మంత్రి Wed, Oct 23, 2024, 06:55 PM
గంగారెడ్డి హత్యతో నాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే సంజయ్ Wed, Oct 23, 2024, 06:53 PM
గద్వాల: క్రమబద్ధీకరణ పేరుతో దోపిడీకి సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ Wed, Oct 23, 2024, 06:50 PM
సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చెప్పలేను: నాంపల్లి కోర్టులో కేటీఆర్ Wed, Oct 23, 2024, 06:50 PM
జాగృతి పోలీస్ కళా బృందంచే అమర వీర పోలీసుల స్మరణ ప్రదర్శన Wed, Oct 23, 2024, 06:46 PM