డీజీపీ వాట్సాప్ ఫోటోతో మోసాలు,,,ఓ వ్యాపారవేత్త కూతురికి వాట్సాప్ కాల్ చేసిన అగంతకుడు

byసూర్య | Tue, May 21, 2024, 09:11 PM

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. మెున్నటి వరకు గిప్టులు, కూపన్లు, ఈ కేవైసీల పేరుతో మోసాలు చేసిన చీటర్లు.. ఇప్పుటు రూటు మార్చారు. డ్రగ్స్ పార్శిల్ పేరుతో అమాయకులను టార్గె్ట్ చేసి మోసాలు చేస్తున్నారు. మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్ వచ్చిందని.. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా.. తెలంగాణ డీజీపీ రవి గుప్తా వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు.


డీజీపీ ఫోటో వాట్సాప్ డీపీగా ఫోన్ నెంబర్ నుంచి ఓ వ్యాపారవేత్త కూతురుకి ఆగంతకులు వాట్సాప్ కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామంటూ ఆమెను బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటూ అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. దీంతో భయపడిపోయిన సదరు వ్యాపారవేత్త కూతురు విషయాన్ని తండ్రికి చెప్పింది. అనుమానం వచ్చిన వ్యాపారవేత్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


వాట్సాప్ ఫోన్ నెంబర్‌ను పరిశీలించగా.. +92 కోడ్‌తో వాట్సాప్ కాల్ వచ్చింది. ఇది పాకిస్థాన్ కోడ్ అని సైబర్ పోలీసులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కాల్స్ వస్తే ఆందోళనతో డబ్బులు పంపకుండా.. వెంటనే దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అంటున్నారు.


Latest News
 

స్వర్ణగిరికి 100 రోజులు పూర్తి Mon, Jun 17, 2024, 03:19 PM
ఎంపీ నగేష్ ని కలిసిన వి. హెచ్. పి నాయకులు Mon, Jun 17, 2024, 03:13 PM
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి Mon, Jun 17, 2024, 03:11 PM
అసెంబ్లీ స్పీకర్ తో ఎమ్మెల్యే భేటీ Mon, Jun 17, 2024, 02:21 PM
రూ.100కి చేరువలో టమాటా Mon, Jun 17, 2024, 02:20 PM