ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణికి కీలక బాధ్యత అప్పజెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Tue, May 21, 2024, 08:05 PM

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణితో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కీరవాణికి కీలక బాధ్యతను అప్పగించారు రేవంత్ రెడ్డి. ఈ భేటీలో.. "జయజయహే తెలంగాణ" పాట రచయిత అందెశ్రీ, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. "జయజయహే తెలంగాణ" పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో.. ఈ పాటను అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేలా రూపొందించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ పాటను కీరవాణితో పాడించే అంశంపై ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం. దీంతో.. త్వరలోనే జయ జయహే తెలంగాణ పాట సరికొత్తగా రాష్ట్ర ప్రజలకు వినిపించే కీలక బాధ్యతను కీరవాణికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది.


జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉండటంతో.. ఆ లోగా పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. అద్దంకి దయాకర్ నటిస్తున్న సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా.. తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఆయనకే ఇవ్వటం గమనార్హం.


 అయితే.. 9 డిసెంబర్ 2009 తర్వాత "జయజయహే తెలంగాణ" పాట కోట్లాది మందికి చేరువైంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా.. అది అమలుకాకపోవటంతో.. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అయితే.. ఈ పాటను కీరవాణితో పాడించాలని చర్చలు జరుగుతుండటంతో పాట ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు ఈ విషయంపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పాటను ఆలపించేందుకు తెలంగాణకు చెందిన సంగీత దర్శకులు, గాయకులెవ్వరూ దొరకట్లేదా అని కామెంట్లు చేస్తున్నారు. వందేమాతరం శ్రీనివాస్ లాంటి సంగీత దర్శక దిగ్గజాలను మర్చిపోయారా అని గుర్తు చేస్తున్నారు.


తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ప్రతి ఒక్కరితో స్టెప్పులేయించటమే కాదు, అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డును కూడా దక్కించుకుంది. నాటు నాటు పాటకు కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM