మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన కొత్తగూడెం ఎస్పీ

byసూర్య | Mon, May 20, 2024, 08:13 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి తనలోని హిడెన్ టాలెంట్‌ను బయటపెట్టారు. సినిమా పాటకు మాస్ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టారు. మే 13న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియగా.. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ జిల్లాల్లో ఎన్నికల బందోబస్తును సక్సెస్ ఫుల్‌గా నిర్వహించినందుకు గానూ ఎస్పీ రోహిత్ రాజ్ గెట్ టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేశారు. పాల్వంచలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రైవేటు పార్టీలో ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ సిబ్బందితో కలిసి సరదాగా డ్యాన్స్ చేసి అలరించారు.


మ్యాడ్ మూవీలోని కళ్లజోడు కాలేజీ పాప పాటకు అదిరే స్టెప్పులు వేశారు. ఎప్పూడూ కేసులు, తనిఖీలు అంటూ బిజీ బిజీగా ఉండే పోలీసు అధికారులు ఇలా సినిమా పాటలకు స్టెప్పులు వేసి కాస్త రిలాక్స్ అయ్యారు. జిల్లా ఎస్పీ తమతో కలిసి డ్యాన్స్ చేయటంతో కిందిస్థాయి సిబ్బంది ఖుషీ అవుతున్నారు. రోహిత్ రాజ్‌కు సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా, గంతలోనూ ఎస్పీ రోహిత్ రాజ్ తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. కాలేజీ రోజుల నుంచే ఆయన మంచి డ్యాన్సర్. గతంలో ఆయన చేసిన డ్యాన్స్ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Latest News
 

RTA ఫ్యాన్సీ నంబర్లు: ఫీజులు భారీగా పెరిగాయి, కొత్త ధరలు లక్షలకు పైగా! Sat, Nov 15, 2025, 10:45 PM
తెలంగాణలో ఎముకలు కొరికే చలి.. అక్కడ అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత Sat, Nov 15, 2025, 10:09 PM
మిర్చి రైతుల పంట పండింది.. అక్కడ క్వింటాల్ ధర ఏకంగా రూ.30 వేలు Sat, Nov 15, 2025, 10:07 PM
తెలంగాణ మహిళలకు .. ఆ రోజు నుంచే ఉచిత చీరలు పంపిణీ Sat, Nov 15, 2025, 10:06 PM
రైలులో బైక్ ఎలా పార్సిల్ చేయాలో తెలుసా.. ఇదిగో ప్రాసెస్ Sat, Nov 15, 2025, 09:58 PM