వాళ్ల పేర్లు చెప్పాలని జైల్లో ఒత్తిడి తెస్తున్నారని కవిత చెప్పారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

byసూర్య | Fri, May 17, 2024, 09:08 PM

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. రోజుకో కీలక పరిణామంతో.. మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ.. రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. ఓవైపు ప్రతిసారి కవిత కస్టడీ గడువును పెంచుతూ పోతున్న న్యాయస్థానం.. మరోవైపు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించగా.. అక్కడ కూడా బెయిల్ విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే.. తీహార్ జైలులో జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న కవితను.. బాల్క సుమన్‌తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ ములాఖత్ అయ్యారు.


ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్ఎస్పీ.. జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే గట్టి నమ్మకంతో ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని ఆర్ఎస్పీ విమర్శించారు. కనీసం న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేశారంటేనే.. కవిత విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. రాత్రికిరాత్రే జడ్జిని మార్చటం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు.


రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారని.. అందులో ఉన్నవాళ్లందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రెండున్నరేళ్లకు పైగా ఈ కేసు నడుస్తోందని.. ఇప్పటికి కూడా కవిత దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదన్నారు. లిక్కర్ పాలసీ వ్యవహారంలో.. కవిత లంచం డిమాండ్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మరి అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.


వాళ్ల పేర్లు, వీళ్ల పేర్లు చెప్పండి అంటూ కవితపై సీబీఐ, ఈడీ అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారని ఆర్ఎస్పీ తెలిపారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీలో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్‌గా ఈడీ వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ‌ని బీజేపీ వాడుకుంటుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.


Latest News
 

వ్యాపారి ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం..! చోరీ చేసేందుకు ముఠా స్కెచ్, చివరకు Tue, Jun 18, 2024, 09:24 PM
కరెంటు పోయిందని చెప్తే డైరెక్ట్‌గా ఇంటికొచ్చేస్తున్నారు..? యువతి ట్వీట్‌పై కేటీఆర్ రియాక్షన్ Tue, Jun 18, 2024, 09:19 PM
రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.. ఇందిరమ్మ ఇండ్లు వాళ్లకు మాత్రమే ఇస్తారట Tue, Jun 18, 2024, 08:19 PM
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ ల బదిలీలు.. చందనా దీప్తికి కొత్త బాధ్యతలు Tue, Jun 18, 2024, 08:18 PM
తెలంగాణకు భారీ వర్ష సూచన... ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్ Tue, Jun 18, 2024, 08:16 PM