కవితను వెంటాడుతున్న బ్యాడ్‌లక్.. హైకోర్టులోనూ అదే తంతు.. అప్పటివరకూ అంతే

byసూర్య | Fri, May 10, 2024, 07:44 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బ్యాడ్ లక్ వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు రౌస్ ఎవెన్యూ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ రాగా.. చివరికి ఆ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ దొరకట్లేదని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా కవితకు నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ కస్డడీలో ఉన్న కవిత.. ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా దాన్ని కాస్త న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ నెల 24న బెయిల్ పిటిషన్‌ మీద విచారణ చేపట్టనున్నట్టు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.


ఇదే క్రమంలోనే.. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్.. బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. జూన్ 1 వరకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేయగా.. ప్రస్తుతం తీహార్ జైల్‌లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు మాత్రం ఇంకా బెయిల్ దొరకటం లేదు. బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్ ఎవెన్యూ కోర్టు గత సోమవారం కొట్టేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒక్కరని ఒకరని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కవిత తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరుతూ వస్తున్నారు. మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఆమెకు ఉందని వాదిస్తున్నారు.


అయితే ఇదే సమయంలో.. అధికారులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వొద్దని.. ఒకవేళ ఇస్తే ఆమె సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు చెప్తున్నారు. అధికారుల వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. కవితకు బెయిల్‌ను తిరస్కరించింది. ఇక్కడ బెయిల్ దొరకట్లేదని.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్తే అక్కడ కూడా వాయిదాల పర్వం మొదలైంది. ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా.. 24కు వాయిదా పడటంతో ఎన్నికలు పూర్తయిపోయినా కవితకు బెయిల్ దొరకటం కష్టంగా కనిపిస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM