ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. ప్రధాన నిందితునికి అరెస్ట్ వారెంట్ జారీ

byసూర్య | Fri, May 10, 2024, 07:33 PM

తెలంగాణలో ఓవైపు లోక్ సభ ఎన్నికల హడావుడి నడుస్తుంటే.. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా.. ఈ కేసులో ప్రస్తుతం సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందుతుడిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు మరో నిందుతుడు శ్రవణ్ కుమార్‌కు నాంపల్లి కోర్టు శుక్రవారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది. ఈ వారెంట్‌తో పంజాగుట్ట పోలీసులు సీఐడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికా‌లో ఉన్న ప్రభాకర్‌ రావు‌, శ్రవణ్ కుమార్‌కు రెడ్ కార్నర్ నోటీసు‌ను జారీ చేయనున్నారు.


ఈ మేరకు నాంపల్లి కోర్టులో పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్-73 కింద పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందుతుడని అందులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన పోలీస్ అధికారులు రాధాకిషన్‌రావు, భుజంగ‌రావు, తిరుపతన్న, ప్రణీత్ రావు‌.. ఇలా అందరి వెనక ఉన్నది ప్రభాకర్ రావేనని అధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఎస్ఐబీ కార్యాలయం‌లో ఆధారాలు, సాక్ష్యాలను ధ్వసం చేసి మాయం చేశారని కోర్టు‌కు తెలిపింది. అరెస్ట్ సందర్భంగా నిందుతులు వెల్లడించిన విషయాలను కోర్టు‌కు పోలీసులు వివరించారు.


వాళ్లు చేసిన ఈ కుట్ర.. వ్యక్తిగత భద్రత‌తో పాటు రాష్ట్ర భద్రతకు కూడా తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దశాబ్దాల పాటు సేకరించిన మావోయిస్టు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో సహా.. కోర్టు‌లో తమ వాదనలను వినిపించారు.


ఇదిలా ఉంటే.. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు తొలిసారిగా స్పందించిన విషయం తెలిసిందే. రెడ్‌కార్నర్ నోటీసు జారీపై కోర్టులో అఫిడవిట్ ద్వారా తన వాదనలు వినిపించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని.. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల పర్యవేక్షణలోనే పనిచేసినట్టు చెప్పుకొచ్చారు. తాను చేసే పనిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందని వివరించారు.


మాజీ సీఎం కేసీఆర్‌ది తనది ఒకటే సామాజిక వర్గం అయినందునే తనను నిందిస్తున్నారని ప్రభాకర్ రావు వాపోయారు. నిజానికి తాను కూడా కేసీఆర్ బాధితుడినేనంటూ బాంబు పేల్చారు. తాను నల్గొండ ఎస్పీగా ఉన్న టైంలో.. ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నాని జిల్లా నేతలు చెప్పటంతో తనను బదిలీ చేశారాని ఆరోపించారు. ఆ తర్వాత చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని.. ఇంటెలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతోనే ఎస్‌ఐబీ ఛీప్‌గా నియమించారంటూ వివరించారు.


మరోవైపు.. ప్రస్తుతం తనకు ఆరోగ్యం బాగోలేదని, క్యాన్సర్ చికిత్స కోసం ఫిబ్రవరిలో అమెరికా వెళ్లినట్లు ప్రభాకర్ రావు వివరించారు. ప్రస్తుతం చికిత్స జరుగుతుందని.. అమెరికా వెళ్లే ముందే ఇండియాకు రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పూర్తి కాగానే.. హైదరాబాద్ వస్తానని తెలిపిన ప్రభాకర్ రావు.. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.


Latest News
 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసం అందరికీ అర్థమైంది,,,మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Mon, May 20, 2024, 10:00 PM
అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలి,,మాజీ మంత్రి హరీశ్ రావు Mon, May 20, 2024, 09:53 PM
తెలంగాణలో మళ్లీ వానలు.. ఈ జిల్లాల్లోనే, వాతావరణశాఖ హెచ్చరికలు Mon, May 20, 2024, 09:01 PM
తెలుగు రాష్ట్రాల మధ్య మరో రైల్వే ట్రాక్.. ఈ రూట్‌లోనే, త్వరలోనే పనులు ప్రారంభం Mon, May 20, 2024, 08:58 PM
కుమార్తెను చంపిన తల్లిదండ్రులు.. తల్లికి దూరమైన 13 నెలల పసికందు Mon, May 20, 2024, 08:54 PM