కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది

byసూర్య | Tue, Apr 23, 2024, 08:53 PM

పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణిస్తున్న ఓ వంతెన ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెనుప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లా ఓడేడు నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. 2016 ఆగస్టు నెలలో రూ.49 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అయితే మధ్యలో కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమి తదితర కారణాలతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది.


అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో వంతెన కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. వంతెన నిర్మాణం నాణ్యతపై కూడా విమర్శలు వస్తున్నాయి. పిల్లర్లు, గట్టర్లకు మధ్య బ్యాలెన్సింగ్ కోసం పెట్టిన చెక్క ముక్కలు చెదలు పట్టాయి. దీంతో గట్లర్లు ఒకవైపు వంగినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నిర్మాణం చేపట్టకపోవడంతో బ్యాలెన్స్ తప్పి కూలినట్లు తెలిసింది.


ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా గత వర్షా కాలంలో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి బీమ్‌లు సైతం కొట్టుకు పోయాయి. పిల్లర్లు కూడా దెబ్బతిన్నాయి. తాజాగా బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ గడ్డర్స్ క్రింద పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం నిర్మాణ పనులతో కూలిందా.. లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. కాంట్రాక్టుల్లో కమిషన్లపై ఉండే శ్రద్ధ నిర్మాణ పనులపై పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

ఆర్టీసీ బస్సు ఆపి, డ్రైవర్‌పై చెప్పుతో దాడి.. యువకుల తిక్క కుదిర్చిన ప్రయాణికులు Wed, May 29, 2024, 09:42 PM
తెలంగాణలో దంచికొట్టనున్న ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక, ఆరెంజ్ అలర్ట్ జారీ Wed, May 29, 2024, 08:18 PM
కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం 'స్పెషల్' ఆపరేషన్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు Wed, May 29, 2024, 08:08 PM
యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం.. మెుత్తం ఎన్ని కోట్లంటే Wed, May 29, 2024, 08:03 PM
జేసీ దివాకర్ రెడ్డికి రియల్టర్ ఝలక్.. సంతకం ఫోర్జరీ, పోలీసులను ఆశ్రయించిన జేసీ Wed, May 29, 2024, 07:59 PM