ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్.. అధిష్టానం ప్రకటించకుండానే

byసూర్య | Tue, Apr 23, 2024, 07:44 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా.. ఇందులో ఖమ్మం స్థానం హాట్ టాఫిక్. ఈ సీటు విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం సీటు విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు.


 అయితే తుమ్మల కుమారుడు యుగంధర్ దాదాపు రేసు నుంచి తప్పుకోగా.. ప్రస్తుతం ఈ సీటు విషయంలో భట్టి వర్సెస్ పొంగులేటి అన్నట్లుగా మారింది. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని పొంగులేటి పట్టుబడుతుండగా.. తన భార్య నందినికి టికెట్ ఇవ్వాలని అదీ కుదరకపోతే.. రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరుతున్నారు. దీంతో ఈ పంచాయతీ కర్ణాటకకు చేరింది. కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ భట్టి, పొంగులేటి చర్చలు జరిపారు. సీటు విషయమై కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని డీకే వారికి వెల్లడించారు.


ఇదిలా ఉండగానే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాం రెడ్డి తరపును కాంగ్రెస్ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ దాఖలైంది. అధిష్టానం ప్రకటించకుండానే కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి తరపున రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అనుచరులు నిరంజన్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, నూకల నరేష్ రెడ్డి, రామ్మూర్తి నాయక్, తదితరులు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టేందుకు మంత్రి పొంగులేటి మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే వియ్యంకుడు రఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించేందుకే నామినేషన్ వేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నామినేషన్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.


Latest News
 

నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రెడ్డి రాక Sat, May 04, 2024, 10:49 AM
తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష: హరీశ్ రావు Sat, May 04, 2024, 10:47 AM
పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్ Sat, May 04, 2024, 10:18 AM
ఎవ‌రీ వేముల రోహిత్‌..? Sat, May 04, 2024, 10:09 AM
తీన్మార్ మల్లన్నపై పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ఇక గట్టి పోటీనే Fri, May 03, 2024, 11:43 PM