హైదరాబాద్‌కు మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్.. శ్రుతి చక్రవర్తికి ఘన స్వాగతం

byసూర్య | Sun, Apr 21, 2024, 07:22 PM

మిసెస్ ఇండియా- 2024 అందాల పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రుతి చక్రవర్తి సత్తా చాటింది. ఏప్రిల్ 16వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో.. భారత్24 సమర్పణలో గ్లామానంద్ గ్రూప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ అందాల పోటీలు నిర్వహించగా.. అందులో పాల్గొన్న శ్రుతి చక్రవర్తి.. మొదటి రన్నరప్‌గా నిలిచి.. సత్తా చాటారు. 20 మంది అందమైన ప్రతిభావంతులైన కంటెస్టెంట్స్‌తో పోటీ పడిన శ్రుతి చక్రవర్తి.. తన అందం, ఆకర్షణతో అందరి హృదయాలను గెలుచుకుంది. పోటీల అనంతరం.. శ్రుతి చక్రవర్తి తిరిగి నగరానికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమెను ఘనమైన స్వాగతం వచ్చింది. రన్నరప్‌ స్థానం శ్రుతి చక్రవర్తికి అంత సులువుగా దక్కలేదు. ఎంతో కఠినమైన జర్నీ ఉంది. కఠినమైన శిక్షణ, వస్త్రాధారణ సెషన్‌లు.. ఇలా చాలా కష్టమే ఉంది. ఆమె అంకితభావం, పట్టుదలకు నిదర్శనమే మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అని శ్రుతి చక్రవర్తి సన్నిహితులు చెప్తున్నారు.


27 ఏళ్ల శ్రుతి చక్రవర్తిది హైదరాబాద్‌. కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేసిన శ్రుతి.. హైదారాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా ఉద్యోగం చేస్తుంది. ముందు నుంచి ఉన్న ఆసక్తితో.. అందాల పోటీల రంగంలోకి ప్రవేశించిన శ్రుతి.. తన విద్యా నైపుణ్యం, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి అంకితమైన గృహిణి పాత్ర వరకు తన బహుముఖ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన నేషనల్ లెవల్ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. అందంతో పాటు ఆమెలోని గ్రేస్ ఆమె స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. ఫలితంగా.. మిసెస్ ఇండియా 2024 పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది.


అందాల పోటీల నుంచి శ్రుతి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు.. ఆమె తనతో కేవలం మిసెస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అనే టైటిల్ మాత్రమే కాదు.. ఎంతో మంది మహిళల సాధికారతతో పాటు ఒక ఇన్సిపిరేషన్‌గా నిలిచింది. ఆమె అద్భుతమైన విజయం.. తనలోని అభిరుచి, హార్డ్ వర్క్, అచంచలమైన సంకల్పంతో ఏ రంగంలో అయినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని మహిళా లోకానికి తెలియజెప్పింది.


Latest News
 

ఇక నుంచి టీజీఎస్ ఆర్టీసీ ఆ బస్సుల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్ Sun, Sep 22, 2024, 08:02 PM
హైదరాబాద్‌లో మళ్లీ హైడ్రా కూల్చవేతలు,,,కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంట్లు నేలమట్టం Sun, Sep 22, 2024, 08:01 PM
హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్ అకౌంట్ హ్యాక్,,,లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరిక Sun, Sep 22, 2024, 07:59 PM
తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి Sun, Sep 22, 2024, 07:57 PM
హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీ.. హైకోర్టుకు ప్రభుత్వం కీలక నివేదిక Sun, Sep 22, 2024, 07:55 PM