ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించేందుకు కృషి చేస్తున్నాం

byసూర్య | Sun, Apr 21, 2024, 03:05 PM

ప్రభుత్వ రాబడుల్లో లీకేజీలను అరికడుతూ ప్రజలపై అదనంగా ఎలాంటి పన్నుల భారం మోపకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. అధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖల రాబడుల్లో ఎలాంటి లొసుగులు లేకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా అధికారిక తప్పిదాలు లేకుండా చూడడం, పన్ను ఎగవేతలను అరికట్టడం, పాత బకాయిలను వసూలు చేయడం వంటి చర్యల ద్వారా రాబడులను పెంచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుత ఉన్నవే కాకుండా... ఇతర రాబడి మార్గాలనూ అన్వేషిస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామని, అదే సమయంలో ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల చెల్లింపులను ఆపడం లేదని వివరించారు. గత డిసెంబరు నుంచి ఈ ఏప్రిల్‌ 15 వరకు రూ. 66,507 కోట్లను వ్యయం చేశామని వివరించారు. ఇందులో ఉద్యోగుల వేతనాలకు రూ. 22,328 కోట్లు, ప్రభుత్వ అప్పులకు సంబంధించి అసలు, వడ్డీ చెల్లింపులకు రూ.26,374కోట్లు వెచ్చించామని వెల్లడించారు. రైతుభరోసా కింద రూ.5,575 కోట్లు, చేయూత పథకానికి రూ.3,840 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రూ. 1,125 కోట్లు, గృహజ్యోతి కింద విద్యుత్తు సబ్సిడీకి రూ.200 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.189 కోట్లు, మహాలక్ష్మి(గ్యాస్‌ సబ్సిడీ) కింద రూ.80 కోట్లు, వ్యవసాయ విద్యుత్తు సబ్సిడీకి రూ.3,924 కోట్లు, బియ్యం సబ్సిడీకి రూ.1,147 కోట్లు, రైతు బీమాకు రూ.734 కోట్లు, డైట్‌ చార్జీలకు రూ.418 కోట్లు, మధ్యాహ్న భోజనం కింద రూ.52 కోట్లు, అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలకు రూ.69 కోట్లు, హోంగార్డ్స్‌ వేతనాలకు రూ.186 కోట్లు, డ్వాక్రా మహిళలకు రూ.267 కోట్లు... మొత్తం రూ.66,507 కోట్లను వెచ్చించామని వివరించారు. రైతు భరోసా పథకం కింద 5 ఎకరాల లోపు ఉన్న 64,75,319 మంది రైతులకు రూ.5,575 కోట్లను చెల్లించామన్నారు. ఎన్నికల కోడ్‌ ముగియగానే రైతు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM