చైన్ స్నాచింగ్స్‌ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

byసూర్య | Sun, Apr 21, 2024, 03:04 PM

 యాదాద్రి భువనగిరి జిల్లాలో చైన్ స్నాచింగ్స్‌, దొంగతనాలతో హడలెత్తిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. ఈ మేరకు శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పొట్టేటి మరియాదాస్‌ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెంలో కొన్నిరోజులుగా భార్యాపిల్లలతో నివాసముంటూ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనుల్లో భాగంగా పరిచయమైన మోటకొండూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కర్నె లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే ఇరు కుటుంబాలను పోషించే క్రమంలో వ్యయం పెరిగింది. కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో సులభ సంపాదన కోసం చైనస్నాచింగ్స్‌, దొంగతనాలకు ప్రణాళిక రూపొందించుకొని సోదరుడైన పొట్టేటి శాంతయ్య, బావమరిది బాణాల రాజే్‌షను ఒప్పించి లక్ష్మితో కలిసి నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. చైనస్నాచింగ్‌కు మారుమూల ప్రాంతాలను, ఒంటరిగా సంచరించే మహిళలను ముందుగానే గుర్తించి రెక్కి నిర్వహించి అదును చూసి దోపిడీకి పాల్పడేవారు. ఈ క్రమంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలు కూడా చేశారు. ఇలా భువనగిరి పరిసరాల్లో స్వల్ప వ్యవధిలోనే 10 చైనస్నాచింగ్స్‌, 5 దొంగతనాలకు పాల్పడటంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. ఆయా ఘటనలపై ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో శుక్రవారం ఆలేరు మండలం జీడికల్‌ ఎక్స్‌ రోడ్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా పట్టుబడిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలో చైనస్నాచింగ్స్‌, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగా తేలింది. దీంతో ఆ ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.30.40లక్షల విలువైన 41తులాల బంగారు, 2 కిలోల వెండి ఆభరణాలు, ఒక మోటార్‌ బైక్‌ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా జైలుకు రిమాండ్‌ ఖైదీలుగా తరలించారు. అయితే చోరీ అయిన మిగతా 10 తులాల బంగారాన్ని కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకుంటామని, బాధితులకు కోర్టు ద్వారా ఆభరణాలను అప్పగిస్తామని కమిషనర్‌ తెలిపారు. జిల్లావాసులను భయాందోళనకు గురిచేసిన ముఠా ఆటకట్టించిన పోలీసులను పోలీస్‌ కమిషనర్‌ అభినందించి నగదు రివార్డును అందజేశారు. సమావేశంలో డీసీపీ రాజేశచంద్ర, అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీలు రవి కిరణ్‌రెడ్డి, రమే్‌షకుమార్‌, మధుసూదనరెడ్డి, గుట్ట రూరల్‌ సీఐ కొండల్‌రావు, తుర్కపల్లి ఎస్‌ఐ తక్కీయోద్దీన, ఆలేరు ఎస్‌ఐ వెంకట శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

విమలక్కను సన్మానించిన ఉప్పల వెంకటేష్ Fri, Sep 20, 2024, 02:14 PM
కథలాపూర్ తహసిల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ Fri, Sep 20, 2024, 02:02 PM
నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM
ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 01:29 PM
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM