ఈ నెల 24న ఇంటర్‌ ఫలితాలు విడుదల

byసూర్య | Sun, Apr 21, 2024, 10:50 AM

ఇంటర్‌ ఫలితాలను ఈ నెల 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షా ఫలితాలను ఒకేసారి విడుదల చేయనుంది.ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అటు టెన్త్‌ ఫలితాలను ఈ నెల 30వ తేదీ లేదా వచ్చే నెల 1వ తేదీన విడుదల చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మార్చి 10 తేదీ నుంచి ఈనెల 10 వ తేదీ వరకు మూల్యాంకనం చేశారు.మార్కుల నమోదు పాటు ఎలాంటి టెక్నికల్‌ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబుపత్రాలను మూడు సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్‌, డీకోడింగ్‌ ప్రక్రియ పూర్తిచేశారు. 2023 ఏడాదిలో మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు.


 


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM