మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు: ఎంపీ అభ్యర్థి శానంపూడి

byసూర్య | Fri, Apr 19, 2024, 01:27 PM

భారతదేశ ప్రధాని మోడీ ప్రోత్సాహంతో తెలంగాణలో వెలుగులు నిండాయని నలగొండ బిజెపి పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో శుక్రవారం పలు నియోజకవర్గంలో పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు , మౌలిక వస్తువుల నిర్మాణం, నగదు బదిలీ ద్వారా గత పదిఏళ్ళ లో 10 లక్షల కోట్లు తెలంగాణకు మోదీ ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది అన్నారు. ములుగు లో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది అన్నారు. కృష్ణ నది జిల్లాల పంపిణీలో తెలంగాణ న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందన్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు నిర్వహిస్తుందని తెలియజేశారు.


రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, తెలంగాణ రైతులకు సమృద్ధిగా ఎరువులు అందిస్తుందని గుర్తు చేశారు. రామగుండంలో ఎన్టిపిసి ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, ఇప్పటికే 16 మెగావాట్ల విద్యుత్ తొలి దశ ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారని అన్నారు. పసుపు బోర్డు ప్రకటనతో నెరవేరిన తెలంగాణ రాష్ట్ర రైతుల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు. తెలంగాణకు ప్రపంచస్థాయి అత్యాధునిక విజ్ఞాన కేంద్రం సైన్స్ సిటీ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని గుర్తు చేశారు.


Latest News
 

జానారెడ్డిని విమర్శించే స్థాయి నీకు లేదు: దామోదర్ రెడ్డి Thu, May 02, 2024, 11:47 AM
ఈ రాష్ట్రాల్లో మరో మూడురోజులు అధిక ఉష్ణోగ్రతలు Thu, May 02, 2024, 10:28 AM
ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలు Thu, May 02, 2024, 10:26 AM
కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 10:23 AM
నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM