తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు, అన్నదాతల్లో ఆందోళన

byసూర్య | Sun, Apr 14, 2024, 05:29 PM

తెలంగాణ వాతావరణంలో అనుహ్యంగా మార్పులు వచ్చాయి. మెున్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు వస్తాయని.., గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.


నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, మెదక్, జగిత్యాల, సంగారెడ్డి, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత హైదరాబాద్ పరిసరాలకు మేఘాలు వస్తాయని.. సాయంత్రం 6 తర్వాత దక్షిణ తెలంగాణపై మేఘాలు కమ్ముకుంటాయన్నారు.


ఇక శనివారం మెదక్‌, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం చిన్నమావందిలో 40.3 మి.మీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిముద్దవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.Latest News
 

కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించలేదు: కవిత లాయర్ మోహిత్ రావు Tue, May 28, 2024, 11:13 PM
రీజినల్‌ రింగ్‌ రోడ్డు.. ఈ ప్రాంతాల్లో ఇంటర్‌ఛేంజ్‌లు, నిర్మాణంపై కీలక అప్టేట్ Tue, May 28, 2024, 08:49 PM
చిన్నపిల్లలను తీసుకొచ్చి చాక్లెట్లలా అమ్మేస్తున్నారు.. హైదరాబాద్‌లో హైటెక్ ముఠా అరెస్టు Tue, May 28, 2024, 08:41 PM
రెమల్ తుఫాను ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్ Tue, May 28, 2024, 08:39 PM
'తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడి పెత్తనం ఏంది భై Tue, May 28, 2024, 08:38 PM