తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడిన రాజాసింగ్

byసూర్య | Sun, Apr 14, 2024, 04:30 PM

హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అందరికీ సుపరిచతమే. ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఆయన వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం సోషల్ మీడియాలో వైరలు అవుతూ ఉంటారు. కరుడుగట్టిన హిందుత్వవాదిగా చెప్పుకునే రాజాసింగ్‍‌లో మరో కోణం కూడా ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటమే కాదు.. తనలో మంచి సింగర్ కూడా ఉన్నాడని నిరూపించారు రాజాసింగ్. శ్రీరామనవమిని పురస్కరించుకొని తొలిసారి తెలుగులో పాట రాసి స్వయంగా పాడారు. నగరంలోని ధూల్‌పేట కేంద్రంగా శ్రీరామ నవమి శోభాయాత్రకు 13 ఏళ్ల క్రితం ఆయన శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు దేశ వ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్శిస్తాయి. ఈ నేపథ్యంలో నవమి పురస్కరించుకొని ఆయన స్వయంగా రాసి పడిన పాట ట్రైలర్ విడుదల చేశారు. 'హిందువుగా పుట్టాలి.. హిందువుగా బ్రతకాలి.. హిందువుగా చావాలిరా.. కాషాయ మెత్తాలి.. ముందడుగు వెయ్యాలి.. పులిలా గర్జించాలిరా తమ్ముడూ..' అంటూ ఎమ్మెల్యే పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రాజాసిగ్ ఎంత బాగా పాడారో..' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, పూర్తి పాటను ఈ నెల 17న ధూల్‌పేటలోని ఆకాశపురి హనుమాన్‌ ఆలయం వద్ద విడుదల చేసి... శోభాయాత్ర ప్రారంభిస్తామని రాజాసింగ్ వెల్లడించారు.


ఇక 2022లో ఆయన ఇస్లాం మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ముస్లిం మత పెద్దలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం ఆయన్ను బీజేపీ శాసనసభపక్ష నేతగా తొలగించింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. అనంతరం కార్యకర్తలు, రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేశారు. ఆ తర్వాత గోషా మహల్ నుంచి మూడోసారి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM