byసూర్య | Mon, Apr 08, 2024, 01:36 PM
రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఆదివారం రాత్రి అమరచింతలో డీఎంఆర్ఎం ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దేశాయి ప్రకాష్ రెడ్డి స్వగృహంలో 'ఇఫ్తార్ విందు' ఇచ్చారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరితో పాటు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య పాల్గొన్నారు.