చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం: భట్టి

byసూర్య | Fri, Mar 01, 2024, 03:14 PM

తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేయడమే తమ ధ్యేయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సీతారాంపురంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదలకు 200 యూనిట్లు విద్యుత్, రూ.500లకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కలిపిస్తున్నామన్నారు. పేదల కోసం రూ.10లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. ఉద్యోగార్థుల కోసం గ్రూప్-1, DSC నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ముదిగొండ మండలం సీతారాంపురం సభలో భట్టి మాట్లాడుతూ… తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలేనని.. సీతారాంపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనులను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మధిర నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరవం తెచ్చేలా పనిచేస్తామన్నారు.


Latest News
 

పేదలకు వరం సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి Sun, Sep 22, 2024, 12:57 PM
పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM