లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు

byసూర్య | Fri, Mar 01, 2024, 11:12 AM

బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పటాన్ చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురి కాగా ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.లాస్య కారును ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత టిప్పర్‌ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు.పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతి వేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ ను ఢీకొన్న తర్వాత వేగంగా వెళ్లి రెయిలింగ్ ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ ను ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి జిల్లా పోలీసులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించే చాన్స్ ఉంది.


Latest News
 

అదానీ ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందించిన అదానీ గ్రూప్ అధినేత Fri, Oct 18, 2024, 07:56 PM
రేవంత్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత రావాలని మంత్రులే చూస్తున్నారన్న సంజయ్ Fri, Oct 18, 2024, 07:52 PM
మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ Fri, Oct 18, 2024, 06:50 PM
మూసీ నది ప్రాజెక్టుపై రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేత కౌంటర్‌ ఛాలెంజ్‌ Fri, Oct 18, 2024, 06:40 PM
జీవో 29ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ Fri, Oct 18, 2024, 05:12 PM