ఐఏఎస్‌ల బదిలీలు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి మళ్లీ ట్రాన్స్‌ఫర్.. ఈసారి ఏ శాఖ

byసూర్య | Fri, Feb 23, 2024, 09:38 PM

తెలంగాణలో బదిలీ పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తున్న రేవంత్ సర్కార్.. భారీ ఎత్తున బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను భారీగా ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. ముఖ్యంగా పోలీసు శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టిన సర్కారు.. ఐఎఎస్‌లను కూడా దశలవారీగా బదిలీ చేస్తోంది. తాజాగా.. మరికొంత మందికి స్థానచలనం కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.


ఇందులో భాగంగా.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రెటరీగా బదిలీ చేసింది. కాగా.. ఆ స్థానంలో మిక్కిలినేని మను చౌదరిని నియమించింది. ఇక జనగామ జిల్లా నూతన కలెక్టర్‌గా రిజ్వాన్ బాషా షేక్‌ను నియమించింది. మరోవైపు.. మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్‌కు కూడా రేవంత్ సర్కార్ స్థాన చలనం కల్పించింది. శైలజా రామయ్యర్‌ను.. దేవాదాయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.


గతంలో పలు శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్చించిన మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చివరగా యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్చించారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. కాగా.. రెండు నెలల్లోనే మరోసారి శైలజా రామయ్యర్‌ను మళ్లీ బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM