byసూర్య | Fri, Feb 23, 2024, 04:24 PM
పంజాబ్, హరియాన సరిహద్దుల్లో పోలీసులు రైతులపై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ గురువారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలో వామపక్ష పార్టీలు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
పంట ఉత్పత్తులకు మద్దతు ధర కోరుతూ మలిదశ ఉద్యమం ప్రారంభించిన రైతులపై మోదీ ప్రభుత్వం కాల్పులు నిర్వహించిందని, ఈ కాల్పుల్లో శుభకరణ్ సింగ్ రైతు మృతి చెందటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.