byసూర్య | Fri, Feb 23, 2024, 04:20 PM
రఘునాథపాలెం మండలం వీ. వీ. పాలెం పీఏసీఎస్ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం చైర్మన్ రావూరి సైదబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని వైస్ చైర్మన్ రావేళ్ల శ్రీనివాస రావు తెలిపారు.
తనకు అవకాశం ఉన్నప్పటికీ సైదబాబుకు డీసీసీబీ చైర్మన్ అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గత చైర్మన్ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని, దీంతో అవిశ్వాసం పెట్టి సైదబాబును ఎన్నుకున్నామని వివరించారు.