byసూర్య | Fri, Feb 23, 2024, 04:12 PM
హర్యానాలో పోలీసులు జరిపిన కాల్పుల్లో రైతు శుభకరన్ సింగ్ మరణించారని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని టీపీసీసీ సభ్యుడు, ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో రైతుల నిరసన దీక్షలకు జిల్లా కాంగ్రెస్ తరపున సంఘీబావం తెలుపుతూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.